Posts

Showing posts with the label Perspectives in Education

ఏకధృవ విధాన ప్రక్రియ (Unipolar process) - PIE

ఏకధృవ విధాన ప్రక్రియ (Unipolar process) నేడు విద్యావిధానంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ప్రాచీన భారతీయ విద్యావిధానం సాంప్రదాయ విద్యావిధానానికి ప్రాధాన్యతను ఇచ్చినట్లు ముందు ప్రకరణంలో కొంత తెలుసుకున్నప్పటికినీ, రాజరిక వ్యవస్థ, గురుకుల విద్య, ఆశ్రమ విద్యావిధానం, గురు ఆశ్రమాలలో గురుసేవలు చేస్తూ అభ్యసనం కొనసాగేది. అంటే ఇచ్చట గురువు ఉపాధ్యాయుడే కేంద్రబిందువు. ఉపాధ్యాయుడు ఏమి బోధించాలనుకొనుచున్నాడో అదే విద్యార్థి అభ్యసించాల్సి వచ్చేది. స్వాతంత్ర్యం సిద్ధించేవరకు దాదాపు ఉపాధ్యాయ ప్రాతినిధ్య విద్య కొనసాగింది. దీనిలో విద్యార్థి పాత్ర స్తబ్దంగా ఉండేదని తెలుసుకున్నాం. ఉపాధ్యాయ కేంద్రిత విద్య ఏకధృవవిధాన ప్రక్రియ ఈ ప్రక్రియలలో బోధనే ముఖ్యం.  ఉపాధ్యాయుడు ప్రధాన పాత్రధారుడు.  విద్యార్థి బోధనకు ప్రతిస్పందిస్తాడే కాని అవగాహన చేసుకోకపోవచ్చు.  విద్యార్థి తన స్వంత అభిప్రాయాలను తాను పెంచుకుంటాడు.  ప్రగతిని కనుగొనుట కష్టం. ద్విధృవ విధాన ప్రక్రియ (Bipolar Process) ఉపాధ్యాయుడు విద్యార్థులను భాగస్వాములను చేయుట విద్యార్థి అవసరాలను గుర్తించుట విద్యార్థి ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థి...

విద్యా ధ్యేయాలు(Aims of Education)

Image
విద్యా ధ్యేయాలు(Aims of Education) - Vinays Info విద్య అనేది ఒక అమూర్త భావన కావడంచేత విద్యాలక్ష్యాలు అనేవి రుచి ఉండవు. ప్రస్తుత లక్ష్యాలన్నీ వ్యక్తులవి, విద్యార్థులవి, ఉపాధ్యాయులవి, తల్లిదండ్రులవి, సమాజానివి. విద్యాలక్ష్యాలు, విధులు వేరువేరుగా భావించరాదు. వ్యక్తి అభిరుచులు, ఆశయాలు తీర్చడంలో విద్య దోహదపడుతుంది. 'అసహాయుడైన జంతుభావంగల చిన్న పసివాడిని, సంతోషభరితమైన, నైతికవిలువలు పాటించే ఒక సమర్ధవంతమైన మానవుడుగా తయారు చేయడమే విద్యావిధి' అంటారు. జాన్ డ్యూయీ వ్యక్తి అభివృద్ధికి రెండు రంగాలున్నాయి. వ్యక్తిగత అభివృద్ధి (Individual development) సామాజిక అభివృద్ధి (Social development) విద్యాలక్ష్యాలు కూడా ఈ విధంగా విభజించబడతాయి. నిరంతర విజ్ఞానాభివృద్ధి వల్ల మానవుని అవసరాలు, అభిరుచులలో కూడా మార్పులు సహజం. నిరంతర ప్రగతి విద్యావిధులు, విద్యా లక్ష్యాలలో మార్పులు కలిగిస్తాయి. లక్ష్యం లేని విద్య చుక్కాని లేని నావవంటిది. విద్యా ధ్యేయాల ప్రాముఖ్యత -విద్య ఒక నిర్ణీత కార్యక్రమం. దీనికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధనకు విద్యావేత్తలు కార్యక్రమాలు రూపొందించి నిర్వహిస్తారు. దానిలో భాగంగా పాఠ్యప్రణాళి...

విద్య యొక్క అర్ధం(Meaning of Education) - PIE

Image
 1. విద్య యొక్క అర్ధం విద్య అనే పదం "విడ్" అనే సంస్కృత భాషకు చెందిన ధాతువు నుండి ఉద్భవించింది. 'విద్' అనగా" తెలుసుకోవడం / సంభవించడం / కనుగొనడం / భావించడం / అవగాహన చేసుకోవడం / జ్ఞాన సముపార్జన/ ప్రజ్ఞను పొందడం / వ్యక్తిలో దాగి ఉన్న అనంత శక్తులను బయటకు తీసే ప్రక్రియ. ఇది ఒక బోధనాప్రక్రియ / శిక్షణ నిచ్చే ప్రక్రియ మరియు దివ్యత్వం, ఆత్మను గూర్చి కూడా తెలియజేస్తుంది. విద్యకు సమానంగా 'శిక్ష' అనే పదాన్ని కూడా ఉపయోగించారు. ఇది సంస్కృత మూలపదం “శాస్" నుండి వచ్చింది. దీని అర్థం "క్రమశిక్షణలో పెట్టడం", "నిర్ధేశించడం", 'నియంత్రణలో ఉంచడం", క్రమశిక్షణతో అవసరమైన వాటిని బోధిస్తూ, శిక్షణ ఇవ్వడం అని అర్ధం. విద్యను ఆంగ్లంలో "Education" అని అంటారు. Education అనే ఆంగ్లపదం 'Educare' + ' Educere' అనే రెండు లాటిన్ పదాల కలయిక. 'Eeducare' అనగా “శిశువును అభివృద్ధి చేయడం", 'Educere' అనగా "శిశువుకు దారి చూపించడం". Education అనే పదంలో 'E' అనగా out of (అంధకారం నుండి బయటకు) అని 'Duco'...

కమిటీ/ కమిషన్ పేరు/కాలం /అధ్యక్షులు | Committees and Commissions

కమిటీ/ కమిషన్ పేరు/కాలం /అధ్యక్షులు -లార్డ్ మెకాలే ప్రతిపాదనలు- 1835 -లార్డ్ మెకాలే -ఉడ్స్ డిస్పాచ్ -1854-చార్లెస్ ఉడ్ -హంటర్ కమిషన్ -1882 -సర్ విలియం హంటర్ (భారతీయ విద్యా కమిషన్) -విశ్వవిద్యాలయ కమిషన్ -1902 -(స్వాతంత్య్రానికి పూర్వం) లార్డ్ కర్జన్ -విశ్వవిద్యాలయ కమిషన్ -1904 – -శాండ్లర్ కమిషన్ -1917 -సర్ మైఖేల్ శాండ్లర్ కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ -హార్టాగ్ కమిటీ -1919 -సర్ ఫిలిప్ హార్టాగ్ -బేసిక్ విద్య -1937 -మహాత్మా గాంధీ -ఎబట్ -ఉడ్ నివేదిక -1937 -ఎబట్- ఉడ్ -సార్టంట్ నివేదిక -1944 -సర్ జాన్ సార్జంట్ -విశ్వవిద్యాలయ కమిషన్ -1948 -సర్వేపల్లి రాధాకష్ణన్ (రాధాకృష్ణ కమిషన్) -మాధ్యమిక కమిషన్ -1952-53 -లక్ష్మణస్వామి మొదలియార్ -కొఠారి కమిషన్ -1964-66 -దౌలత్‌సింగ్ కొఠారి (భారతీయ విద్యా కమిషన్) -మొదటి జాతీయ విద్యావిధానం -1968 – -ఈశ్వరీబాయి పటేల్ కమిటీ -1977 -ఈశ్వరీబాయి పటేల్ -మాల్కం ఆదిశేషయ్య కమిటీ -1978 -మాల్క ఆదిశేషయ్య -నూతన జాతీయ విద్యావిధానం -1986 – -ఆచార్య రామమూర్తి కమిటీ -1990 -ఆచార్య రామమూర్తి -ఎన్ జానర్దన్‌రెడ్డి కమిటీ -1991-92 -ఎన్ జనార్దన్‌రెడ్డి -కార్యాచరణ పథకం -1992 — (పీవోఏ-1992)...

తత్వశాస్త్రం - ఉపాధ్యాయుడు (Philosophy Teacher)

Image
తత్వశాస్త్రం - ఉపాధ్యాయుడు (Philosophy Teacher) - Perspectives in Education ఉపాధ్యాయులందరు తత్త్వవేత్తలు కానవసరంలేదు. కాని ప్రతి ఉపాధ్యాయునకు విద్యాతత్వం తెలిసి ఉండాలి. విద్యా ప్రక్రియలు అమలు చేయడానికి విద్యాతత్వ అవగాహన ఎంతైనా అవసరం. దేశ సంస్కృతి, మతాలు, సంప్రదాయాలు, అలవాట్లు, నమ్మకాలు విద్యపై ప్రభావం చూపుతాయి. విద్యావిలువలు వీటిపై ఆధారపడి ఉంటాయి. ఉపాధ్యాయుడు కూడా సంఘంలో ఒక వ్యక్తియే. కాబట్టి వీటి ప్రభావానికి అతడు లోనుగాక తప్పదు. గతంలో ఉపాధ్యాయుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులతో సమానుడు కాని ఈనాడు ఉపాధ్యాయుడు . విద్యార్థికి మార్గదర్శి, స్నేహితుడు, తత్త్వవేత్త, కాలానుగుణంగా అతని స్థానంలో మార్పులు వచ్చాయి.  ఈనాడు ఉపాధ్యాయుడు భావిపౌరులను తీర్చిదిద్దుతున్నాడు. ఆదర్శాలను, విలువలను నేర్పుతున్నాడు. తాత్విక భావంగల ఉపాధ్యాయుడు తీర్చలేని సమస్యలుండవు అంటారు.  తాత్విక జ్ఞానం ఉపాధ్యాయునికి చేసే సహకారం : 1. ఉపాధ్యాయునికి ఒక జీవిత విధానం నివ్వడం.   2. నిర్మాణాత్మకంగా, శాస్త్రీయంగా ఆలోచించగల శక్తినిస్తుంది.. 3. ఉపాధ్యాయునికి ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది. . 4.క్రమశిక్షణ, సమస్యలు తీర్చి...

ఆవాస పాఠశాలలు (Residential Schools)

Image
ఆవాస పాఠశాలలు (Residential Schools) - Perspectives in Education  వీటినే " ఆశ్రమ పాఠశాలలు " అంటున్నారు. తెలంగాణా రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, షెడ్యూల్ తెగల (గిరిజనుల) గురుకుల విద్యాలయాల సంస్థ, బి.సి. గురుకుల విద్యాలయాల సంస్థల ఆధ్వర్యంలో SC, ST, BC వర్గాల విద్యాభివృద్ధికై ఇవి నడుపబడుతున్నాయి. ఇటీవలి కాలంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు కూడా ప్రత్యేక గురుకుల విద్యాలయాల సంస్థను ఏర్పాటు చేసి మొదటిదశలో 71 మైనార్టీ గురుకులలు ఏర్పాటుచేసింది. ఉపాధ్యాయుల సాధికారతకు ఉపయోగపడిన విధం : ఉన్నత విద్యార్హతలున్న ఉపాధ్యాయులకు తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, ప్రదర్శించడానికి వీలు కలిగింది. విద్యార్థులు నిత్యం ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉండడం వల్ల తాము ఆశించిన రీతిలో వారిని తీర్చిదిద్దుటకు ఉపాధ్యాయులకు వీలు కలిగింది.

బౌద్ధకాలంలో విద్యావిధానం - Education in Buddhist times

Image
బౌద్ధకాలంలో విద్యావిధానం -  Education in Buddhist times - Perspectives in Education "బౌద్ధ విద్యావిధానం హిందూ విద్యా విధానంలో ఏర్పడిన లోపాలను సంస్కరించడానికి, భారతీయ తాత్విక సిద్ధాంతమైన “మోక్షసాధన” ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించింది.  బౌద్ధవిద్యావిధానంలో ఎలాంటి భేదాలకు తావు లేకుండా అన్ని వర్గాల వారికి విద్యలో సమాన ప్రతిపత్తి కల్పించబడింది. నలంద, తక్షశిల, వల్లభి, విక్రమశాల మొదలైన ప్రముఖ విద్యాసంస్థలు ఈ కాలంనాటివే. వేదవిద్యాపద్ధతిలాగ ఈ విధానంలో కూడా విద్యార్థిదశ “ప్రబృష్టి" అనే ప్రాథమిక విద్యాభ్యాస కార్యక్రమంతో 8 సం॥ల వయస్సులో గురువు విద్యార్ధిచేత ఈ కింది మూడు మాటలు అనిపించేవారు.  "బుద్ధం శరణం గచ్ఛామి “ధర్మం శరణం గచ్ఛామి" సంఘం శరణం గచ్ఛామి" ఈ మాటలు వల్లించిన తరవాతనే విద్యార్థి సంఘంలో ప్రవేశించడానికి అర్హత సంపాదించేవాడు.’  విహారాలు, మఠాలు' బౌద్ధకాలం నాటి విద్యా కేంద్రాలు. ఉపాధ్యాయుడు కావడానికి 10 సం॥ల పాటు సన్యాసిగా ఉండి బోధనావృత్తిలో ప్రావీణ్యతను సంపాదించాలి. ఉపాధ్యాయుడికి, విద్యార్థికి మధ్య తండ్రీకొడుకుల మధ్య ఉండే సంబంధం ఉండేది. విజ్ఞాన సంబంధమైన, ఆధ్యాత్మి...

తత్వశాస్త్రం క్రమశిక్షణ (Philosophy-discipline)

Image
తత్వశాస్త్రం క్రమశిక్షణ (Philosophy-discipline) విద్యార్థుల క్రమశిక్షణ కూడా పాఠ్యపుస్తకాలలాగే తత్త్వశాస్త్ర పునాదులపైనే ఏర్పడుతుంది.  ఈ విషయంలోనూ తాత్వికుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.  ఆదర్శవాదులు ఉపాధ్యాయుని మూర్తిమత్వమునకు ఎంత ప్రాముఖ్యతనిస్తారు.  ఉపాధ్యాయుని వ్యక్తిత్వ ప్రభావమునకు విద్యార్థిలోనై తనంతటతానే క్రమశిక్షణ అలవరచుకొంటాడు అన్నది వీరి భావన.  శిశువును దండించకున్న అతడు చెడిపోవచ్చు అన్న భావన వీరిది. (spare the rod spoil the child) ప్రకృతివాదులు స్వేచ్ఛాక్రమశిక్షణ (free discipline) కావాలంటారు. విద్యార్థిని దండించడం నిరసిస్తారు. విద్యార్థికి సంపూర్ణ స్వేచ్ఛనివ్వడంలో ఏకీభవిస్తారు. క్రమశిక్షణ విషయంలో తాత్వికులు భిన్న అభిప్రాయాలు వెలిబుచ్చుతారు. తత్వం విద్యావిధానంపై చూపు ప్రభావంలో ఇది ఒకటి.

తత్వశాస్త్రం - బోధనా పద్ధతులు (Philosophy Pedagogy)

Image
తత్వశాస్త్రం - బోధనా పద్ధతులు (Philosophy Pedagogy) - Perspectives in Education బోధనా పద్ధతులు వివిధ తాత్త్వికవాదులు గురుశిష్యుల సంబంధానికిచ్చే ప్రాధాన్యతపై ఆధారపడిఉన్నది.  ఆదర్శవాదులు - (Idealists) ఉపాధ్యాయునికి ప్రాధాన్యతనిస్తారు. అతడు విద్యాబోధనలో సర్వశక్తి సంపన్నుడు, జోక్యం ఎల్లప్పుడు కలిగించుకోవచ్చు. వీరు బోధనలో ఉపన్యాన (Lecture) చర్చా (Discussion) బట్టి అభ్యసన (Rote) లాంటి పద్ధతులను బలపరుస్తారు.  ప్రకృతివాదులు (Naturalists) శిశుకేంద్రీకృత విద్యకు (Child-centered) ప్రాధాన్యత ఇస్తారు. వీరికి వర్తమాన స్వానుభవం ముఖ్యం. పనిచేస్తూ అభ్యసించడం (Leam ing by doing) వీరి అభ్యసన పద్ధతి.  వ్యావహారిక సత్తావాదులు ప్రాజెక్టు పద్ధతి, సమస్యాపరిష్కార ' పద్ధతి (project and problem solving method) ను ప్రోత్సహిస్తారు. తాత్విక దృక్పథం ఆధారంగా బోధనా పద్ధతులు రూపొందుతాయి.

విద్యాధ్యేయాలు - ప్రకార్యాలు (Aims and Process of Education)

విద్యాధ్యేయాలు - ప్రకార్యాలు (Aims and Process of Education) శబ్దశాస్త్రమును అనుసరించి " ఫిలాసఫీ ” అనే పదం ' ఫిలోస్' (philos), 'సోఫియా (sophia) అనే రెండు గ్రీకు పదాల నుండి ఉత్పన్నమైనది.  ' ఫిలోస్ ' అనగా ప్రేమ (love) అని ' సోఫియా ' అంటే జ్ఞానం (wisdom) అని అర్థం.  ఫిలాసఫి అంటే సంపూర్ణార్ధంలో జ్ఞానపిపాస (Love of wisdom) అని అర్థాన్ని ఇస్తుంది. తత్వశాస్త్రాన్ని దర్శనశాస్త్రం అన్ని కూడ అంటారు. ఇది సృష్టి రహస్యాన్ని, జీవిత పరమావధిని అన్వేషిస్తుంది. తత్వశాస్త్ర పరమలక్ష్యం సత్యదర్శనం. భారతీయ తత్వశాస్త్రంలో రెండు ప్రధాన విభాగాలున్నాయి. అవి : 1. ఆస్తికవాదం - దేవుని ఉనికిని అంగీకరిస్తుంది. 2. నాస్తిక వాదం - దేవుని ఉనికిని అంగీకరించదు. ఆస్థికవాదంలో ఆరు విభాగాలున్నాయి. ఇవి వేద ప్రామాణీకాలు వీటిని " షడ్జర్శనాలు ”అని కూడా అంటారు. అవి : 1. మీమాంస - కర్మకాండను ప్రతిపాదించేవి 2. వేదాంత - జ్ఞానకాండను ప్రతిపాదించేవి 3. సాంఖ్య 4. యోగ 5. న్యాయ 6. వైశేషకాలు నాస్థికవాదంలో చార్వాక, జైన, బౌద్ధ, తాత్విక వాదనలు ముఖ్యమైనవి. తత్వశాస్త్రం - ప్రధాన విభాగాలు తత్వశాస్త్రంలో...

స్వాతంత్య్రానంతర కమిటీలు, కమీషన్లు - Post-Independence Committees, Commissions

స్వాతంత్య్రానంతర కమిటీలు, కమీషన్లు - Post-Independence Committees, Commissions 1. రాధాకృష్ణన్ కమీషన్ (1948–49) 2. మొదలియార్ కమీషన్ (1952-53) 3. కొఠారి కమీషన్ (1964-66) 4. స్త్రీవిద్యపై జాతీయ కమిటీ (1957-59) 5. జాతీయ విద్యా విధానం (1968) 6. జాతీయ నూతన విద్యా విధానం (1986) 7. రామ్మూర్తి సమీక్ష సంఘం (1990) 8. CABE కమిటీ - జనార్ధన రెడ్డి కమిటీ (1992) 9. జాతీయ సలహా కమిటీ (యక్పాల్ కమిటీ) (1992)

విద్యాభివృద్ధి - వివిధ కమిటీలు, కమీషన్లు - Educational Development - Various Committees, Commissions

విద్యాభివృద్ధి - వివిధ కమిటీలు, కమీషన్లు - Educational Development - Various Committees, Commissions భారతదేశంలోని జాతీయ విధానంలో సార్వత్రిక ప్రాథమిక విద్య ఎప్పుడూ ప్రధానభాగంగా ఉద్ధేశించడం జరిగింది. 1882 ఇండియన్ ఎడ్యుకేషన్ కమీషన్, గోపాలకృష్ణ గోఖలే (1910-1912) 4 సం॥ల పిల్లలకు సార్వత్రిక ప్రాథమిక విద్యనందించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలని ఎంత కృషిచేసినా సత్ఫలితాలను సాధించలేకపోయాం. ఎన్ని ప్రయత్నాలు జరిగినా ప్రాథమిక విద్యాకార్యక్రమం అతి పరిమితంగానే జరిగింది. 1947లో మన అక్షరాస్యత 14శాతం మాత్రమే. 1944 విద్యాభివృద్ధి ప్రణాళికలలో సార్వత్రిక ప్రాథమిక విద్య 6–14 సం॥ల మధ్య వయస్సులోని అందరికీ 40 సం॥ల వ్యవధిలో అంచలవారీగా కార్యక్రమాలను అందించాలని అన్నారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ నిర్దేశాలను అమలుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. స్వాతంత్య్ర పూర్వ కమీషన్లు, కమిటీలు. ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ (1882-83) 7-8 సం॥ల ప్రాథమిక విద్యను రెండు ఉపదశలుగా విభజించింది. 1-5 సం॥లు మొదటి దశగా, తరవాత 6-8 సం॥లను రెండో దశగాను విభజించడం జరిగింది. 1947లో స్వాతంత్య్రానంతరం 6-14 సంవత్సరాల పిల్లలకు పాఠశాలల్లో సార్...

రాజ్యాంగ సదుపాయాలు (Constitutional provisions)

రాజ్యాంగ సదుపాయాలు (Constitutional provisions) భారతదేశం స్వాతంత్య్రానంతరం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా రూపొందింది. వయోజన ఓటింగ్ హక్కు ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులచే ఏర్పడిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగి ఉంది. రాజ్యాంగ చట్టంలో పొందుపరచబడిన నిబంధనలచే ఇది పరిరక్షించబడుతున్నది. రాజ్యాంగ చట్టంలో కేవలం పరిపాలనా సంబంధమైన అంశాలేకాకుండా సాంఘిక, ఆర్థిక, రాజకీయ, విద్యాభివృద్ధికి సంబంధించిన అంశాలను కూడ ప్రస్తావించడం జరిగింది. దేశంలో విద్యాభివృద్ధి లేనిదే రాజ్యాంగ పీఠికలో ఉదహరించబడిన సమానన్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మొదలైన వాటికి విలువలేదు. విద్యాభివృద్ధి లేనిదే ఆర్థిక, సాంఘిక, రాజకీయ ప్రగతి సాధ్యపడదు. నిరక్షరాస్యులుగా ఉన్న కోట్లాది ప్రజలు అట్టడుగు స్థాయిలోనే ఉంటూ ప్రతి విషయానికి ఇతరులపై ఆధారపడవలసి వస్తోంది. అందువల్ల విద్యాభివృద్ధిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పవచ్చు. -అందువల్ల రాజ్యాంగంలో విద్యాభివృద్ధికి ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది. మన రాజ్యాంగ చట్ట ప్రకారం విద్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ సంబంధించిన అంశం. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభు...

1921 తరవాత కాలంలో ప్రాథమిక విద్య - Primary education after 1921

1921 తరవాత కాలంలో ప్రాథమిక విద్య - Primary education after 1921 1921 సంవత్సరం ఎలిమెంటరీ విద్యా చరిత్రలో ఒక మైలురాయి. ఈ సంవత్సరంలో ఎలిమెంటరీ విద్యను భారతీయ మంత్రులకు అప్పగించడమైనది. నిర్బంధ ప్రాథమిక విద్యను త్వరితంగా అభివృద్ధి చేయవచ్చుననీ, ఇది ప్రాథమిక విద్య సార్వజనీకరణకు నాంది పలుకుతుందనీ ఆశించడమైనది. కాని ఫలితాలు ఆశించిన వాటికి విరుద్ధంగా ఉండటంవల్ల 1929లో హార్టాగ్ కమిటీని నియమించి పరిస్థితిని అంచనా వేయవలసిందిగా ఆదేశించారు. ఈ కమిటీ స్థానిక సంస్థలు అనుభవం లేనివనీ, ఫలితంగా స్థబ్ధత చోటుచేసుకున్నట్లుగా అంచనా వేశారు. అందువల్ల స్థానిక సందర్శించి తనిఖీని నిర్వహించి విద్యా ప్రగతికి అవసరమయ్యే సౌకర్యాల కోసం అధికారులతో తరచుగా చర్చించేటట్లు తగిన చర్యలు తీసుకొనవలసినదిగా సిఫారసు చేశారు. 1937లో ప్రాంతీయ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఫలితంగా ప్రాంతాలవారీగా నిర్బంధ విద్యకు ప్రణాళికలను సిద్ధం చేశారు. నిధులను సమకూర్చారు. 1937లో వార్థాలో మహాత్మాగాంధీ బేసిక్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. కాని 1939లో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభం కావడంవల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తి విద్యాప్రగతి కుంటుపడింది. ...

19వ శతాబ్దంలో స్వదేశీ ఎలిమెంటరీ విద్య - Indigenous elementary education in the 19th century

19వ శతాబ్దంలో స్వదేశీ ఎలిమెంటరీ విద్య - Indigenous elementary education in the 19th century 17, 18 వ శతాబ్దాల మధ్యకాలంలో స్థిరమైన పరిస్థితులు లేకపోయినప్పటికీ, హిందూ, మహ్మదీయ విద్యాసంస్థలు పక్కపక్కవే వెలిశాయి. ఇలాంటి వ్యవస్థ 19వ శతాబ్ది ఆరంభంలో "చాలా చురుకుగా పనిచేస్తూ ఉండేది. ఈ కాలంలో రెండురకాలైన ఎలిమెంటరీ పాఠశాలలను వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన వ్యక్తులు నిర్వహించేవారు. ఉన్నత కుటుంబీకులకు చెందిన పిల్లలు ఈ పాఠశాలలో చదివేవారు.  పాఠశాల: కరికులమ్ 3R's (Reading, writing, Arithmetic) కు మాత్రమే పరిమితమై ఉండేది. పాఠశాలలను మసీదు, దేవాలయాలలో లేదా పోషకుల ఇండ్లలో గాని, ఉపాధ్యాయుల ఇండ్లలోగాని నిర్వహించేవారు, ముద్రించిన పుస్తకాలు గాని, కాగితాలుగాని వాడలేదు. కాని ఉపాధ్యాయులు విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ వహించేవారు. ఇరువురి మధ్య వాత్సల్య సంబంధాలు నెలకొని ఉండేవి. పెబ్బ, (పర్యవేక్షత) మానిటోరియల్ పద్ధతి అమలులో ఉండేది. కాలక్రమేణా స్వదేశీ పాఠశాలలు కనుమరుగయ్యాయి.

వేదకాలంలో విద్య - Education in the Vedic Period

వేదకాలంలో విద్య - Education in the Vedic Period వేదకాలంలో విద్య : (క్రీ.పూ. 1400-6000) వేదకాలంలోని ముఖ్యమైన విద్యాలక్ష్యాలు దేశభక్తి, సత్ప్రవర్తన . ప్రాచీన సంస్కృతీ వ్యాప్తి, శారీరక, నైతిక, వైజ్ఞానికపరంగా మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దడం. వృత్తినైపుణ్యాన్ని పెంపొందించడం మొదలైనవి. గ్రామాలకు దూరంగా అరణ్యాలలో గురువులు విద్యాబోధనను కొనసాగించేవారు.  గురువు ఆశ్రమంలో విద్య కొనసాగించడం వల్ల ఈ విద్యను "గురుకుల విద్య" గా పిలిచేవారు. విద్యాబోధనకు బ్రాహ్మణులకు మాత్రమే అవకాశం ఉండేది.  తత్వశాస్త్రం, వ్యాకరణం, ఖగోళశాస్త్రం, తర్కశాస్త్రం (లాజిక్), భాష మొదలైనవి ప్రధాన బోధనాంశాలు. బోధన ప్రధానంగా మౌఖికంగా ఉండేది.. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా అభ్యసన జరిగేది.  కంఠస్థం చేయడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు.  ఒకే కుటుంబంలోని సభ్యులులాగ గురుశిష్యుల సంబంధం ఉండేది.

ఇస్లాం విద్య (Education in Islam)

ఇస్లాం విద్య (Education in Islam) ఇస్లాం మతం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. " బిస్మిల్లా "(4సం॥రాల 4నెలల 4 రోజులు నిండిన వారికి ) అనే ఉత్సవంతో ముస్లిం బాలుడి విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది.  ముస్లిం విద్యావిధానంలో “ మక్తాబ్ ”లు ప్రాథమిక పాఠశాలలుగా, మదరసాలు ఉన్నత విద్యాసంస్థలుగా ఉండేవి.  మక్తాబ్ -  ప్రాథమిక పాఠశాల మదరసాలు - ఉన్నత విద్యాసంస్థలు వీరికాలంలో కరికులమ్ గణితం, భూగోళశాస్త్రం, ఖగోళశాస్త్రం మొదలైనవి చేర్చబడినాయి.  ఈ కాలంలో సరైన పరీక్షా విధానం లేదు.  స్త్రీ విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు.  ఉపన్యాస, చర్చా పధ్ధతులు బోధనా పద్ధతులుగా ఉపయోగించేవారు.  విద్య మతపరంగా ఉండటంచేత అది హిందువులను ఎక్కువగా ఆకర్షించలేదు.

19వ శతాబ్దిలో ఎలిమెంటరీ విద్యావ్యవస్థ | Elementary education system in the 19th century

19వ శతాబ్దిలో ఎలిమెంటరీ విద్యావ్యవస్థ | Elementary education system in the 19th century క్రీ.శ 1813 నుంచి ఈస్టిండియా కంపెనీ విద్యా బాధ్యతను స్వీకరించింది.  19వ శతాబ్ది ఆరంభంలో ఎలిమెంటరీ విద్య ప్రధానంగా రెండు కారణాలవల్ల అంతగా అభివృద్ధి చెందలేదు.  ఒకటి అథోముఖ వడపోత సిద్ధాంతంను (Downward filtration theory) అవలంభించడం. దీనిద్వారా విద్యా సౌకర్యాలను పై తరగతివారికి మాత్రమే అందచేయడం.  రెండవది విద్యకు కేటాయించిన నిధులు పూర్తిగా పరిమితం కావడం.  1854 ఉడ్స్ డిస్పాచ్ తిరిగి సామాన్య ప్రజానీకానికి విద్య అందుబాటులో ఉండేటట్లు అనేక తీర్మానాలను చేసింది. ఏదిఏమైనా 19వ శతాబ్ది చివరివరకు ప్రాథమిక విద్య ఎలాంటి ప్రగతి సాధించలేదు. 1902లో లార్డ్ కర్జన్ భారతీయ విశ్వవిద్యాలయ కమీషన్ ను నియమించి విద్యావ్యాప్తికి చొరవ చూపారు.  1901లో సిమ్లాలో విద్యాసదస్సును నిర్వహించి ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయస్థాయి వరకు ఉన్న విద్యా సమస్యలను చర్చించారు. కాని ఈ కమీషన్ భారతీయులనెవరిని సభ్యులుగా నియమించకుండా భారతీయుల మనోభావాలకు తీవ్ర విఘాతాన్ని కలిగించారు.  1904లో కర్జన్ ఎలిమెంటరీ పాఠశాలల నిర్...

వర్ణాశ్రమ ధర్మాలు | Varnashrama Dharmas

వర్ణాశ్రమ ధర్మాలు | Varnashrama Dharmas విద్యార్థి తన జీవితకాలంలోని వివిధ దశలు, వారు చేయాల్సిన ధర్మాలను గురించి వివరిస్తూ  1) బ్రహ్మచర్యం  2) గృహస్థాశ్రమం  3) వానప్రస్థాశ్రమం  4) సన్యాసం  అనే నాలుగు విభాగాలుగా వర్గీకరించారు.  బ్రహ్మచర్య దశలో ప్రతి ఒక్కరు గురుముఖంగా ఉండే విద్య, జ్ఞాన సముపార్జన చేయాలి.  గృహస్థాశ్రమం ప్రకారం మంచి విద్యను పొంది, సముపార్జించిన జ్ఞానంలో ధర్మబద్ధంగా జీవిస్తూ, తన తరవాత మరొకతరాన్ని సమాజానికి అందించడానికి, · వివాహ వ్యవస్థ ద్వారా నియమబద్ధమైన జీవితాన్ని అనుభవించాలి. ఇతరులకు కష్టం కలిగించని రీతిలో ఆనందంగా గడపాలి.  వానప్రస్థం ; గృహస్థాశ్రమ ధర్మం అనంతరం ప్రాపంచిక భోగాలకు దూరంగా ఉండి మంచి ప్రశాంతమైన జీవితం గడపడానికి ప్రశాంత వాతావరణంలో గృహస్థాశ్రమ ధర్మం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి.  సన్యాసం , బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమదశ, వాన ప్రస్థదశల అనంతరం తన జీవిత సార్థకతకు 'మోక్షమే' ప్రధాన కాలప్రమాణం. కాబట్టి ప్రతి ఒక్కరు కుటుంబ భవబంధాలను విడనాడి మోక్షసాధనకై ధర్మప్రచారం చాలి. అరణ్యాలు / ఆశ్రమాల్లో ఆదర్శజీవితం కొన...

ప్రాచీన కాలపు విద్య | Ancient Education

Image
ప్రాచీన కాలపు విద్య -  Ancient education ప్రాచీన విద్య ముఖ్యంగా హరప్పా నాగరికత, మొహంజొదారో: నాగరికత కాలంలో నాటి ప్రజల ఆరాధ్యదైవం ' పశుపతి '.  ఆటవిక జీవితం గడిపే వ్యక్తులను పశువిధానం. నుంచి మేలైన, మెరుగైన జీవిత విధానానికి తీసుకువెళ్లాలనే భావన ఆనాడు కూడా వచ్చింది.  మంచి జీవన విధానానికి ఎంతగానో ఉపకరిస్తుందని భావించారు. అందుకే ఆ కాలంలో ప్రణాళికాబద్ధమైన నగరజీవనం, వాస్తు విధానం, శిల్ప, భవన నిర్మాణం మనకు కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుంది.  ఆనాటి విద్యా విధానాన్ని గమనిస్తే దాదాపు అన్ని వర్గాలకు విద్యను అందించినట్లుగా తెలుస్తున్నది.  మంచివిద్య ద్వారా ' మోక్షం ' లేదా ఉజ్వలమైన జీవితం లభిస్తుందని భావించారు. కాని ఇదే సమయంలో వర్ణాశ్రమ ధర్మాలకు బదులుగా వర్ణవ్యవస్థ అంటే నిమ్న వర్ణాలు, అగ్రవర్ణాలు, కులవ్యవస్థకు దారితీసింది.  హిందూ సమాజం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు గా వర్గీకరణ జరిగింది. Image: Quora 1) బ్రాహ్మణులు : వేదాలు హిందూమత ధర్మ పురాణాలు, క్రతువులు నిర్వహణ, మతఛాందస భావనలు, హిందూమతం గురించి అధ్యయనం చేసేవారు. 2) క్షత్రియుడు: క్షేత్రధర్మం కలవాడు క్షత్రియుడు అనే న...