వేదకాలంలో విద్య - Education in the Vedic Period

వేదకాలంలో విద్య - Education in the Vedic Period

  • వేదకాలంలో విద్య : (క్రీ.పూ. 1400-6000) వేదకాలంలోని ముఖ్యమైన విద్యాలక్ష్యాలు దేశభక్తి, సత్ప్రవర్తన. ప్రాచీన సంస్కృతీ వ్యాప్తి, శారీరక, నైతిక, వైజ్ఞానికపరంగా మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దడం. వృత్తినైపుణ్యాన్ని పెంపొందించడం మొదలైనవి.
  • గ్రామాలకు దూరంగా అరణ్యాలలో గురువులు విద్యాబోధనను కొనసాగించేవారు. 
  • గురువు ఆశ్రమంలో విద్య కొనసాగించడం వల్ల ఈ విద్యను "గురుకుల విద్య"గా పిలిచేవారు. విద్యాబోధనకు బ్రాహ్మణులకు మాత్రమే అవకాశం ఉండేది. 
  • తత్వశాస్త్రం, వ్యాకరణం, ఖగోళశాస్త్రం, తర్కశాస్త్రం (లాజిక్), భాష మొదలైనవి ప్రధాన బోధనాంశాలు.
  • బోధన ప్రధానంగా మౌఖికంగా ఉండేది.. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా అభ్యసన జరిగేది. 
  • కంఠస్థం చేయడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. 
  • ఒకే కుటుంబంలోని సభ్యులులాగ గురుశిష్యుల సంబంధం ఉండేది.

Post a Comment

Previous Post Next Post

Contact Form