ఏకధృవ విధాన ప్రక్రియ (Unipolar process) - PIE

ఏకధృవ విధాన ప్రక్రియ (Unipolar process)

నేడు విద్యావిధానంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ప్రాచీన భారతీయ విద్యావిధానం సాంప్రదాయ విద్యావిధానానికి ప్రాధాన్యతను ఇచ్చినట్లు ముందు ప్రకరణంలో కొంత తెలుసుకున్నప్పటికినీ, రాజరిక వ్యవస్థ, గురుకుల విద్య, ఆశ్రమ విద్యావిధానం, గురు ఆశ్రమాలలో గురుసేవలు చేస్తూ అభ్యసనం కొనసాగేది. అంటే ఇచ్చట గురువు ఉపాధ్యాయుడే కేంద్రబిందువు. ఉపాధ్యాయుడు ఏమి బోధించాలనుకొనుచున్నాడో అదే విద్యార్థి అభ్యసించాల్సి వచ్చేది. స్వాతంత్ర్యం సిద్ధించేవరకు దాదాపు ఉపాధ్యాయ ప్రాతినిధ్య విద్య కొనసాగింది. దీనిలో విద్యార్థి పాత్ర స్తబ్దంగా ఉండేదని తెలుసుకున్నాం.

ఉపాధ్యాయ కేంద్రిత విద్య

ఏకధృవవిధాన ప్రక్రియ

  • ఈ ప్రక్రియలలో బోధనే ముఖ్యం. 
  • ఉపాధ్యాయుడు ప్రధాన పాత్రధారుడు. 
  • విద్యార్థి బోధనకు ప్రతిస్పందిస్తాడే కాని అవగాహన చేసుకోకపోవచ్చు. 
  • విద్యార్థి తన స్వంత అభిప్రాయాలను తాను పెంచుకుంటాడు. 
  • ప్రగతిని కనుగొనుట కష్టం.

ద్విధృవ విధాన ప్రక్రియ (Bipolar Process)

  • ఉపాధ్యాయుడు విద్యార్థులను భాగస్వాములను చేయుట
  • విద్యార్థి అవసరాలను గుర్తించుట
  • విద్యార్థి ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థి పరస్పరం ఒకరిచే మరొకరు ప్రభావితం అవుతారు. 
  • ఉపాధ్యాయుని మూర్తిమత్వం విద్యార్థి ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. 
  • విద్యార్థి ప్రవర్తన ఉపాధ్యాయునిపై ప్రభావం చూపుతుంది. ఇచ్చట ఉపాధ్యాయుడు ఒక దృవం అయితే, విద్యార్థి మరోధ్భవం. 
  • బోధన చురుకుగా సాగిన అభ్యసన కూడా సులభంగా జరుగుతుంది. 
  • ఇరుధ్భవాలు పరస్పరం ఆకర్షించుకుంటాయి. 
  • ఇద్దరిమధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడుతాయి. అభ్యసన సఫలీకృతమౌతుంది. 
  • ఈ విధానాన్ని ఆడమ్స్ (Adams) రూపొందించారు. 
  • అనంతరకాలంలో వచ్చిన సంస్కరణలు, అవసరాలు దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం 1964-67 మధ్య కాలంనుంచి బోధనాభ్యసన ప్రక్రియలలో ఉపాధ్యాయునితోపాటు విద్యార్థికి కూడా -

Post a Comment

Previous Post Next Post

Contact Form