విద్యా ధ్యేయాలు(Aims of Education)

విద్యా ధ్యేయాలు(Aims of Education) - Vinays Info

విద్యా ధ్యేయాలు(Aims of Education) - Vinays Info

విద్య అనేది ఒక అమూర్త భావన కావడంచేత విద్యాలక్ష్యాలు అనేవి రుచి ఉండవు. ప్రస్తుత లక్ష్యాలన్నీ వ్యక్తులవి, విద్యార్థులవి, ఉపాధ్యాయులవి, తల్లిదండ్రులవి, సమాజానివి. విద్యాలక్ష్యాలు, విధులు వేరువేరుగా భావించరాదు. వ్యక్తి అభిరుచులు, ఆశయాలు తీర్చడంలో విద్య దోహదపడుతుంది. 'అసహాయుడైన జంతుభావంగల చిన్న పసివాడిని, సంతోషభరితమైన, నైతికవిలువలు పాటించే ఒక సమర్ధవంతమైన మానవుడుగా తయారు చేయడమే విద్యావిధి' అంటారు. జాన్ డ్యూయీ

వ్యక్తి అభివృద్ధికి రెండు రంగాలున్నాయి.

  1. వ్యక్తిగత అభివృద్ధి (Individual development)
  2. సామాజిక అభివృద్ధి (Social development)

విద్యాలక్ష్యాలు కూడా ఈ విధంగా విభజించబడతాయి. నిరంతర విజ్ఞానాభివృద్ధి వల్ల మానవుని అవసరాలు, అభిరుచులలో కూడా మార్పులు సహజం. నిరంతర ప్రగతి విద్యావిధులు, విద్యా లక్ష్యాలలో మార్పులు కలిగిస్తాయి. లక్ష్యం లేని విద్య చుక్కాని లేని నావవంటిది.

విద్యా ధ్యేయాల ప్రాముఖ్యత

-విద్య ఒక నిర్ణీత కార్యక్రమం. దీనికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధనకు విద్యావేత్తలు కార్యక్రమాలు రూపొందించి నిర్వహిస్తారు. దానిలో భాగంగా పాఠ్యప్రణాళికలు, బోధనాపద్ధతులు, బోధనాభ్యసన పరిస్థితుల కల్పన జరుగుతుంది. ధ్యేయాలు లేనట్లైతే చుక్కానిలేని పడవవలె విద్యావ్యవస్థ మారుతుంది. విద్యాస్థాయినిబట్టి స్వభావాన్నిబట్టి కూడా లక్ష్యాలు


విద్యా ధ్యేయాలు ఈ కింది ప్రధాన అవసరాలు తీర్చుటకు ఆధారాలుగా ఉంటాయి.

  1. విద్యా ప్రక్రియల అంచనా
  2. లక్ష్యాల గమ్య సాధన
  3. అర్ధవంతమైన విద్యాభ్యసన
  4. సమగ్ర మూల్యాంకనం
  5. విద్యాప్రగతి తెలుసుకోవడం
  6. పాఠ్య బోధన

విద్యా లక్ష్యాలను ప్రధానంగా రెండు విభాగాలుగా పేర్కొంటారు.

  1. వైయక్తిక లక్ష్యాలు (Individual Aims)
  2. సామాజిక లక్ష్యాలు(Social Aims)

Post a Comment

Previous Post Next Post

Contact Form