విద్య యొక్క అర్ధం(Meaning of Education) - PIE

 1. విద్య యొక్క అర్ధం

విద్య అనే పదం "విడ్" అనే సంస్కృత భాషకు చెందిన ధాతువు నుండి ఉద్భవించింది. 'విద్' అనగా" తెలుసుకోవడం / సంభవించడం / కనుగొనడం / భావించడం / అవగాహన చేసుకోవడం / జ్ఞాన సముపార్జన/ ప్రజ్ఞను పొందడం / వ్యక్తిలో దాగి ఉన్న అనంత శక్తులను బయటకు తీసే ప్రక్రియ. ఇది ఒక బోధనాప్రక్రియ / శిక్షణ నిచ్చే ప్రక్రియ మరియు దివ్యత్వం, ఆత్మను గూర్చి కూడా తెలియజేస్తుంది. విద్యకు సమానంగా 'శిక్ష' అనే పదాన్ని కూడా ఉపయోగించారు. ఇది సంస్కృత మూలపదం “శాస్" నుండి వచ్చింది. దీని అర్థం "క్రమశిక్షణలో పెట్టడం", "నిర్ధేశించడం", 'నియంత్రణలో ఉంచడం", క్రమశిక్షణతో అవసరమైన వాటిని బోధిస్తూ, శిక్షణ ఇవ్వడం అని అర్ధం.

విద్యను ఆంగ్లంలో "Education" అని అంటారు. Education అనే ఆంగ్లపదం 'Educare' + ' Educere' అనే రెండు లాటిన్ పదాల కలయిక. 'Eeducare' అనగా “శిశువును అభివృద్ధి చేయడం", 'Educere' అనగా "శిశువుకు దారి చూపించడం". Education అనే పదంలో 'E' అనగా out of (అంధకారం నుండి బయటకు) అని 'Duco' అనగా వృద్ధిలోకి తీసుకొనిరావడం", (To bringup) లేదా "దారి చూపడం” (To leadforth) అనే అర్ధాన్ని తెలుపుతుంది.

Meaning of Education

'సంస్కారం' అనే పదాన్ని కూడా భారతీయులు విద్యకు సమానార్ధకంగా ఉపయోగించారు.

భారతదేశంలో విద్య అనేది అత్యంత పవిత్రమైనది. ఇది ఉపాసనలో భాగం. ఋషుల ప్రకారం విద్య అనేది "మానవుడికి మూడవ నేత్రం", మరియు ద్విత్వమ్ జన్మమ్ అనగా (మానవుడు విద్య ద్వారా రెండో జన్మను పొందుతాడని అర్ధం). మూడవ నేత్రాన్నే “జ్ఞాననేత్రం" అని కూడా పిలుస్తారు.

పరిమిత అర్ధంలో విద్య అంటే కేవలం వ్యక్తి యొక్క అభివృద్ధి, పాఠశాలలో ఏర్పాటు చేసిన అంశాలు, కార్యక్రమాల ప్రభావాల ఫలితం కేవలం 3R's కి పరిమితమై, పట్టాలు పొందడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అదే విస్తృతార్ధంలో కేవలం 3R's చదవడం కాదు. జీవితమే విద్య. ఇది తల్లి గర్భం నుండి మృత్యువు

వరకు కొనసాగుతుంది. ఇది ఒక అవిరామ కృషి మరియు ప్రతి అనుభవం విద్యాపరమైన విలువ కలిగి వ్యక్తి ప్రవర్తనను ఎప్పటికప్పుడు మార్చుతూ, వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధికి తోడ్పడుతుంది. విద్య యొక్క లక్ష్యం కేవలం అంతర్గత శక్తులను వెలికితీయడం కాదు. వాటిని ఎలా పెంపొందించుకోవాలో కూడా తెలియజేసే ప్రక్రియ.

విద్య అంటే విద్యార్థి పాఠశాలలో నేర్చుకొనే జ్ఞానంగా లేదా జీవితానుభవాల వల్ల కలిగే జ్ఞాన వికాసంగా నిర్వచించవచ్చును. విద్య ద్వారా వచ్చేది జ్ఞానం కాని జ్ఞానం అంటే కేవలం సమాచార సేకరణ కాకుండా సరైన రీతిలో జీవన స్థితిగతుల్లో ఆచరణా నైపుణ్యం. అప్పుడు అది విజ్ఞానమవుతుంది.

విముక్తికి దారి చూపేది విద్య ఇది సర్వాంగీణ వికాసాన్ని, ప్రగతిని, సంపూర్ణ జీవనాన్ని అందిస్తుంది. 

విద్య - నిర్వచనాలు :

  1. "మనిషిని స్వావలంబకుడిగా, నిస్వార్ధతత్వపరుడిగా తయారుచేసేది విద్య - ఋగ్వేదం / వేదాలు.
  2. మోక్ష సాధనకు దారి చూపించేదే విద్య" - ఉపనిషత్తులు.
  3. సాక్షాత్కారం పొందుటయే విద్య". - శంకరాచార్యులు “ఆత్మ జ్ఞానమే విద్య". = భగవద్గీత
  4. "మనిషిలో అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయడమే విద్య" - గాంధీజీ “శీల నిర్మాణమే విద్య" - దయానంద సరస్వతి

Perspectives in education | vidhya drukpathalu | విద్య దృక్పథాలు Vidya Drukpadhalu- Perspectives in Education [ TELUGU MEDIUM ]


Post a Comment

Previous Post Next Post

Contact Form