ఇస్లాం విద్య (Education in Islam)
- ఇస్లాం మతం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. "బిస్మిల్లా"(4సం॥రాల 4నెలల 4 రోజులు నిండిన వారికి ) అనే ఉత్సవంతో ముస్లిం బాలుడి విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది.
- ముస్లిం విద్యావిధానంలో “మక్తాబ్”లు ప్రాథమిక పాఠశాలలుగా, మదరసాలు ఉన్నత విద్యాసంస్థలుగా ఉండేవి.
మక్తాబ్ - ప్రాథమిక పాఠశాల
మదరసాలు - ఉన్నత విద్యాసంస్థలు
- వీరికాలంలో కరికులమ్ గణితం, భూగోళశాస్త్రం, ఖగోళశాస్త్రం మొదలైనవి చేర్చబడినాయి.
- ఈ కాలంలో సరైన పరీక్షా విధానం లేదు.
- స్త్రీ విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు.
- ఉపన్యాస, చర్చా పధ్ధతులు బోధనా పద్ధతులుగా ఉపయోగించేవారు.
- విద్య మతపరంగా ఉండటంచేత అది హిందువులను ఎక్కువగా ఆకర్షించలేదు.