Posts

Showing posts from March, 2023

ఏకధృవ విధాన ప్రక్రియ (Unipolar process) - PIE

ఏకధృవ విధాన ప్రక్రియ (Unipolar process) నేడు విద్యావిధానంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ప్రాచీన భారతీయ విద్యావిధానం సాంప్రదాయ విద్యావిధానానికి ప్రాధాన్యతను ఇచ్చినట్లు ముందు ప్రకరణంలో కొంత తెలుసుకున్నప్పటికినీ, రాజరిక వ్యవస్థ, గురుకుల విద్య, ఆశ్రమ విద్యావిధానం, గురు ఆశ్రమాలలో గురుసేవలు చేస్తూ అభ్యసనం కొనసాగేది. అంటే ఇచ్చట గురువు ఉపాధ్యాయుడే కేంద్రబిందువు. ఉపాధ్యాయుడు ఏమి బోధించాలనుకొనుచున్నాడో అదే విద్యార్థి అభ్యసించాల్సి వచ్చేది. స్వాతంత్ర్యం సిద్ధించేవరకు దాదాపు ఉపాధ్యాయ ప్రాతినిధ్య విద్య కొనసాగింది. దీనిలో విద్యార్థి పాత్ర స్తబ్దంగా ఉండేదని తెలుసుకున్నాం. ఉపాధ్యాయ కేంద్రిత విద్య ఏకధృవవిధాన ప్రక్రియ ఈ ప్రక్రియలలో బోధనే ముఖ్యం.  ఉపాధ్యాయుడు ప్రధాన పాత్రధారుడు.  విద్యార్థి బోధనకు ప్రతిస్పందిస్తాడే కాని అవగాహన చేసుకోకపోవచ్చు.  విద్యార్థి తన స్వంత అభిప్రాయాలను తాను పెంచుకుంటాడు.  ప్రగతిని కనుగొనుట కష్టం. ద్విధృవ విధాన ప్రక్రియ (Bipolar Process) ఉపాధ్యాయుడు విద్యార్థులను భాగస్వాములను చేయుట విద్యార్థి అవసరాలను గుర్తించుట విద్యార్థి ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థి...

విద్యా ధ్యేయాలు(Aims of Education)

Image
విద్యా ధ్యేయాలు(Aims of Education) - Vinays Info విద్య అనేది ఒక అమూర్త భావన కావడంచేత విద్యాలక్ష్యాలు అనేవి రుచి ఉండవు. ప్రస్తుత లక్ష్యాలన్నీ వ్యక్తులవి, విద్యార్థులవి, ఉపాధ్యాయులవి, తల్లిదండ్రులవి, సమాజానివి. విద్యాలక్ష్యాలు, విధులు వేరువేరుగా భావించరాదు. వ్యక్తి అభిరుచులు, ఆశయాలు తీర్చడంలో విద్య దోహదపడుతుంది. 'అసహాయుడైన జంతుభావంగల చిన్న పసివాడిని, సంతోషభరితమైన, నైతికవిలువలు పాటించే ఒక సమర్ధవంతమైన మానవుడుగా తయారు చేయడమే విద్యావిధి' అంటారు. జాన్ డ్యూయీ వ్యక్తి అభివృద్ధికి రెండు రంగాలున్నాయి. వ్యక్తిగత అభివృద్ధి (Individual development) సామాజిక అభివృద్ధి (Social development) విద్యాలక్ష్యాలు కూడా ఈ విధంగా విభజించబడతాయి. నిరంతర విజ్ఞానాభివృద్ధి వల్ల మానవుని అవసరాలు, అభిరుచులలో కూడా మార్పులు సహజం. నిరంతర ప్రగతి విద్యావిధులు, విద్యా లక్ష్యాలలో మార్పులు కలిగిస్తాయి. లక్ష్యం లేని విద్య చుక్కాని లేని నావవంటిది. విద్యా ధ్యేయాల ప్రాముఖ్యత -విద్య ఒక నిర్ణీత కార్యక్రమం. దీనికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధనకు విద్యావేత్తలు కార్యక్రమాలు రూపొందించి నిర్వహిస్తారు. దానిలో భాగంగా పాఠ్యప్రణాళి...