19వ శతాబ్దంలో స్వదేశీ ఎలిమెంటరీ విద్య - Indigenous elementary education in the 19th century
17, 18 వ శతాబ్దాల మధ్యకాలంలో స్థిరమైన పరిస్థితులు లేకపోయినప్పటికీ, హిందూ, మహ్మదీయ విద్యాసంస్థలు పక్కపక్కవే వెలిశాయి. ఇలాంటి వ్యవస్థ 19వ శతాబ్ది ఆరంభంలో "చాలా చురుకుగా పనిచేస్తూ ఉండేది. ఈ కాలంలో రెండురకాలైన ఎలిమెంటరీ పాఠశాలలను వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన వ్యక్తులు నిర్వహించేవారు. ఉన్నత కుటుంబీకులకు చెందిన పిల్లలు ఈ పాఠశాలలో చదివేవారు.
పాఠశాల: కరికులమ్ 3R's (Reading, writing, Arithmetic) కు మాత్రమే పరిమితమై ఉండేది. పాఠశాలలను మసీదు, దేవాలయాలలో లేదా పోషకుల ఇండ్లలో గాని, ఉపాధ్యాయుల ఇండ్లలోగాని నిర్వహించేవారు, ముద్రించిన పుస్తకాలు గాని, కాగితాలుగాని వాడలేదు. కాని ఉపాధ్యాయులు విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ వహించేవారు. ఇరువురి మధ్య వాత్సల్య సంబంధాలు నెలకొని ఉండేవి. పెబ్బ, (పర్యవేక్షత) మానిటోరియల్ పద్ధతి అమలులో ఉండేది. కాలక్రమేణా స్వదేశీ పాఠశాలలు కనుమరుగయ్యాయి.