విద్యాభివృద్ధి - వివిధ కమిటీలు, కమీషన్లు - Educational Development - Various Committees, Commissions
భారతదేశంలోని జాతీయ విధానంలో సార్వత్రిక ప్రాథమిక విద్య ఎప్పుడూ ప్రధానభాగంగా ఉద్ధేశించడం జరిగింది. 1882 ఇండియన్ ఎడ్యుకేషన్ కమీషన్, గోపాలకృష్ణ గోఖలే (1910-1912) 4 సం॥ల పిల్లలకు సార్వత్రిక ప్రాథమిక విద్యనందించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలని ఎంత కృషిచేసినా సత్ఫలితాలను సాధించలేకపోయాం. ఎన్ని ప్రయత్నాలు జరిగినా ప్రాథమిక విద్యాకార్యక్రమం అతి పరిమితంగానే జరిగింది. 1947లో మన అక్షరాస్యత 14శాతం మాత్రమే.
1944 విద్యాభివృద్ధి ప్రణాళికలలో సార్వత్రిక ప్రాథమిక విద్య 6–14 సం॥ల మధ్య వయస్సులోని అందరికీ 40 సం॥ల వ్యవధిలో అంచలవారీగా కార్యక్రమాలను అందించాలని అన్నారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ నిర్దేశాలను అమలుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
స్వాతంత్య్ర పూర్వ కమీషన్లు, కమిటీలు.
ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ (1882-83) 7-8 సం॥ల ప్రాథమిక విద్యను రెండు ఉపదశలుగా విభజించింది. 1-5 సం॥లు మొదటి దశగా, తరవాత 6-8 సం॥లను రెండో దశగాను విభజించడం జరిగింది. 1947లో స్వాతంత్య్రానంతరం 6-14 సంవత్సరాల పిల్లలకు పాఠశాలల్లో సార్వత్రిక, ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని సూచించడం జరిగింది. మనదేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం కూడా బ్రిటీష్వారి పాలనలో కొన్ని కమీషన్లు నియమించడం, వారి సూచనల మేరకు విద్యా విధానంలో మార్పులు తేవడం జరిగింది. అవి :
1. మెకాలే మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ (1854)
2. ఉడ్స్ డిస్పాచ్ (1854)
3. ఇండియన్ ఎడ్యుకేషన్ కమిటీ (1882-83)
4. హంటర్ కమీషన్ (1882)
5. భారతీయ విశ్వవిద్యాలయ కమీషన్ (1902) 6. హర్టాగ్ కమిటీ (1929)
7. భారత ప్రభుత్వ చట్టం (1985).
8. జాకీర్ హుస్సేన్ కమిటీ (1938)
9. సార్జంట్ రిపోర్ట్ (1944)
పై కమిటీలు, కమీషన్లు స్వాతంత్య్రానికి పూర్వం ఏర్పాటు చేయబడినవి. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరవాత అన్ని రంగాల్లో మార్పు వచ్చినట్లే విద్యారంగంలోను మార్పులు వచ్చాయి. మన రాజ్యాంగంలో విద్యా విషయంలో కొన్ని నిబంధనలు చేర్చడం జరిగింది.