Posts

తత్వశాస్త్రం క్రమశిక్షణ (Philosophy-discipline)

Image
తత్వశాస్త్రం క్రమశిక్షణ (Philosophy-discipline) విద్యార్థుల క్రమశిక్షణ కూడా పాఠ్యపుస్తకాలలాగే తత్త్వశాస్త్ర పునాదులపైనే ఏర్పడుతుంది.  ఈ విషయంలోనూ తాత్వికుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.  ఆదర్శవాదులు ఉపాధ్యాయుని మూర్తిమత్వమునకు ఎంత ప్రాముఖ్యతనిస్తారు.  ఉపాధ్యాయుని వ్యక్తిత్వ ప్రభావమునకు విద్యార్థిలోనై తనంతటతానే క్రమశిక్షణ అలవరచుకొంటాడు అన్నది వీరి భావన.  శిశువును దండించకున్న అతడు చెడిపోవచ్చు అన్న భావన వీరిది. (spare the rod spoil the child) ప్రకృతివాదులు స్వేచ్ఛాక్రమశిక్షణ (free discipline) కావాలంటారు. విద్యార్థిని దండించడం నిరసిస్తారు. విద్యార్థికి సంపూర్ణ స్వేచ్ఛనివ్వడంలో ఏకీభవిస్తారు. క్రమశిక్షణ విషయంలో తాత్వికులు భిన్న అభిప్రాయాలు వెలిబుచ్చుతారు. తత్వం విద్యావిధానంపై చూపు ప్రభావంలో ఇది ఒకటి.

తత్వశాస్త్రం - బోధనా పద్ధతులు (Philosophy Pedagogy)

Image
తత్వశాస్త్రం - బోధనా పద్ధతులు (Philosophy Pedagogy) - Perspectives in Education బోధనా పద్ధతులు వివిధ తాత్త్వికవాదులు గురుశిష్యుల సంబంధానికిచ్చే ప్రాధాన్యతపై ఆధారపడిఉన్నది.  ఆదర్శవాదులు - (Idealists) ఉపాధ్యాయునికి ప్రాధాన్యతనిస్తారు. అతడు విద్యాబోధనలో సర్వశక్తి సంపన్నుడు, జోక్యం ఎల్లప్పుడు కలిగించుకోవచ్చు. వీరు బోధనలో ఉపన్యాన (Lecture) చర్చా (Discussion) బట్టి అభ్యసన (Rote) లాంటి పద్ధతులను బలపరుస్తారు.  ప్రకృతివాదులు (Naturalists) శిశుకేంద్రీకృత విద్యకు (Child-centered) ప్రాధాన్యత ఇస్తారు. వీరికి వర్తమాన స్వానుభవం ముఖ్యం. పనిచేస్తూ అభ్యసించడం (Leam ing by doing) వీరి అభ్యసన పద్ధతి.  వ్యావహారిక సత్తావాదులు ప్రాజెక్టు పద్ధతి, సమస్యాపరిష్కార ' పద్ధతి (project and problem solving method) ను ప్రోత్సహిస్తారు. తాత్విక దృక్పథం ఆధారంగా బోధనా పద్ధతులు రూపొందుతాయి.

తత్వశాస్త్రం - పాఠ్యపుస్తకాలు (Philosophy Text books)

తత్వశాస్త్రం - పాఠ్యపుస్తకాలు (Philosophy Text books) విద్యా ప్రణాళిక (Curriculum) ననుసరించి పాఠ్యప్రణాళికలు (syllabus) రూపొందించబడినవి. పాఠ్యప్రణాళిక ప్రతి పాఠ్యవిషయ అధ్యయనమును కొన్ని లక్ష్యాలు, ఆశయాలు, ఉద్దేశ్యాలు తెలుపుతుంది. పాఠ్యపుస్తకాలు వీటిననుసరించి రూపొందుతాయి. తాత్త్వికులు కొందరు పాఠ్యపుస్తకాలకు మరీ అంత ప్రాధాన్యం ఇవ్వరాదని, విద్యచర్యలు ద్వారా అనుభవాలు గణించేవిధంగా జరగాలని అంటారు. పాఠ్యపుస్తకాల తయారీలోనూ భిన్న అభిప్రాయాలున్నాయి. బత్తాయి రేఖావటానికి పాఠ్యపుస్తకంలో చోటుండాలని ప్రకృతి. వాదులంటారు. విషయాత్మక (objective) తార్కిక వరుసక్రమం ప్రయోజకత్వం ఉండాలని వ్యావహారిక సత్తావాదుల అభిప్రాయం. పాఠ్యపుస్తకాలలో విలువలు, వ్యక్తిత్వం ప్రతిభింబించాలని భావవాదులంటారు. ఏవిఏమైనా ఈ నాటికీ పాఠ్యపుస్తకాల స్థానానికి ఎలాంటి భంగం కలుగలేదు. 

విద్యాధ్యేయాలు - ప్రకార్యాలు (Aims and Process of Education)

విద్యాధ్యేయాలు - ప్రకార్యాలు (Aims and Process of Education) శబ్దశాస్త్రమును అనుసరించి " ఫిలాసఫీ ” అనే పదం ' ఫిలోస్' (philos), 'సోఫియా (sophia) అనే రెండు గ్రీకు పదాల నుండి ఉత్పన్నమైనది.  ' ఫిలోస్ ' అనగా ప్రేమ (love) అని ' సోఫియా ' అంటే జ్ఞానం (wisdom) అని అర్థం.  ఫిలాసఫి అంటే సంపూర్ణార్ధంలో జ్ఞానపిపాస (Love of wisdom) అని అర్థాన్ని ఇస్తుంది. తత్వశాస్త్రాన్ని దర్శనశాస్త్రం అన్ని కూడ అంటారు. ఇది సృష్టి రహస్యాన్ని, జీవిత పరమావధిని అన్వేషిస్తుంది. తత్వశాస్త్ర పరమలక్ష్యం సత్యదర్శనం. భారతీయ తత్వశాస్త్రంలో రెండు ప్రధాన విభాగాలున్నాయి. అవి : 1. ఆస్తికవాదం - దేవుని ఉనికిని అంగీకరిస్తుంది. 2. నాస్తిక వాదం - దేవుని ఉనికిని అంగీకరించదు. ఆస్థికవాదంలో ఆరు విభాగాలున్నాయి. ఇవి వేద ప్రామాణీకాలు వీటిని " షడ్జర్శనాలు ”అని కూడా అంటారు. అవి : 1. మీమాంస - కర్మకాండను ప్రతిపాదించేవి 2. వేదాంత - జ్ఞానకాండను ప్రతిపాదించేవి 3. సాంఖ్య 4. యోగ 5. న్యాయ 6. వైశేషకాలు నాస్థికవాదంలో చార్వాక, జైన, బౌద్ధ, తాత్విక వాదనలు ముఖ్యమైనవి. తత్వశాస్త్రం - ప్రధాన విభాగాలు తత్వశాస్త్రంలో...

స్వాతంత్య్రానంతర కమిటీలు, కమీషన్లు - Post-Independence Committees, Commissions

స్వాతంత్య్రానంతర కమిటీలు, కమీషన్లు - Post-Independence Committees, Commissions 1. రాధాకృష్ణన్ కమీషన్ (1948–49) 2. మొదలియార్ కమీషన్ (1952-53) 3. కొఠారి కమీషన్ (1964-66) 4. స్త్రీవిద్యపై జాతీయ కమిటీ (1957-59) 5. జాతీయ విద్యా విధానం (1968) 6. జాతీయ నూతన విద్యా విధానం (1986) 7. రామ్మూర్తి సమీక్ష సంఘం (1990) 8. CABE కమిటీ - జనార్ధన రెడ్డి కమిటీ (1992) 9. జాతీయ సలహా కమిటీ (యక్పాల్ కమిటీ) (1992)

విద్యాభివృద్ధి - వివిధ కమిటీలు, కమీషన్లు - Educational Development - Various Committees, Commissions

విద్యాభివృద్ధి - వివిధ కమిటీలు, కమీషన్లు - Educational Development - Various Committees, Commissions భారతదేశంలోని జాతీయ విధానంలో సార్వత్రిక ప్రాథమిక విద్య ఎప్పుడూ ప్రధానభాగంగా ఉద్ధేశించడం జరిగింది. 1882 ఇండియన్ ఎడ్యుకేషన్ కమీషన్, గోపాలకృష్ణ గోఖలే (1910-1912) 4 సం॥ల పిల్లలకు సార్వత్రిక ప్రాథమిక విద్యనందించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలని ఎంత కృషిచేసినా సత్ఫలితాలను సాధించలేకపోయాం. ఎన్ని ప్రయత్నాలు జరిగినా ప్రాథమిక విద్యాకార్యక్రమం అతి పరిమితంగానే జరిగింది. 1947లో మన అక్షరాస్యత 14శాతం మాత్రమే. 1944 విద్యాభివృద్ధి ప్రణాళికలలో సార్వత్రిక ప్రాథమిక విద్య 6–14 సం॥ల మధ్య వయస్సులోని అందరికీ 40 సం॥ల వ్యవధిలో అంచలవారీగా కార్యక్రమాలను అందించాలని అన్నారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ నిర్దేశాలను అమలుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. స్వాతంత్య్ర పూర్వ కమీషన్లు, కమిటీలు. ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ (1882-83) 7-8 సం॥ల ప్రాథమిక విద్యను రెండు ఉపదశలుగా విభజించింది. 1-5 సం॥లు మొదటి దశగా, తరవాత 6-8 సం॥లను రెండో దశగాను విభజించడం జరిగింది. 1947లో స్వాతంత్య్రానంతరం 6-14 సంవత్సరాల పిల్లలకు పాఠశాలల్లో సార్...

రాజ్యాంగ సదుపాయాలు (Constitutional provisions)

రాజ్యాంగ సదుపాయాలు (Constitutional provisions) భారతదేశం స్వాతంత్య్రానంతరం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా రూపొందింది. వయోజన ఓటింగ్ హక్కు ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులచే ఏర్పడిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగి ఉంది. రాజ్యాంగ చట్టంలో పొందుపరచబడిన నిబంధనలచే ఇది పరిరక్షించబడుతున్నది. రాజ్యాంగ చట్టంలో కేవలం పరిపాలనా సంబంధమైన అంశాలేకాకుండా సాంఘిక, ఆర్థిక, రాజకీయ, విద్యాభివృద్ధికి సంబంధించిన అంశాలను కూడ ప్రస్తావించడం జరిగింది. దేశంలో విద్యాభివృద్ధి లేనిదే రాజ్యాంగ పీఠికలో ఉదహరించబడిన సమానన్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మొదలైన వాటికి విలువలేదు. విద్యాభివృద్ధి లేనిదే ఆర్థిక, సాంఘిక, రాజకీయ ప్రగతి సాధ్యపడదు. నిరక్షరాస్యులుగా ఉన్న కోట్లాది ప్రజలు అట్టడుగు స్థాయిలోనే ఉంటూ ప్రతి విషయానికి ఇతరులపై ఆధారపడవలసి వస్తోంది. అందువల్ల విద్యాభివృద్ధిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పవచ్చు. -అందువల్ల రాజ్యాంగంలో విద్యాభివృద్ధికి ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది. మన రాజ్యాంగ చట్ట ప్రకారం విద్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ సంబంధించిన అంశం. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభు...