తత్వశాస్త్రం - పాఠ్యపుస్తకాలు (Philosophy Text books)
విద్యా ప్రణాళిక (Curriculum) ననుసరించి పాఠ్యప్రణాళికలు (syllabus) రూపొందించబడినవి. పాఠ్యప్రణాళిక ప్రతి పాఠ్యవిషయ అధ్యయనమును కొన్ని లక్ష్యాలు, ఆశయాలు, ఉద్దేశ్యాలు తెలుపుతుంది. పాఠ్యపుస్తకాలు వీటిననుసరించి రూపొందుతాయి. తాత్త్వికులు కొందరు పాఠ్యపుస్తకాలకు మరీ అంత ప్రాధాన్యం ఇవ్వరాదని, విద్యచర్యలు ద్వారా అనుభవాలు గణించేవిధంగా జరగాలని అంటారు. పాఠ్యపుస్తకాల తయారీలోనూ భిన్న అభిప్రాయాలున్నాయి. బత్తాయి రేఖావటానికి పాఠ్యపుస్తకంలో చోటుండాలని ప్రకృతి. వాదులంటారు. విషయాత్మక (objective) తార్కిక వరుసక్రమం ప్రయోజకత్వం ఉండాలని వ్యావహారిక సత్తావాదుల అభిప్రాయం. పాఠ్యపుస్తకాలలో విలువలు, వ్యక్తిత్వం ప్రతిభింబించాలని భావవాదులంటారు. ఏవిఏమైనా ఈ నాటికీ పాఠ్యపుస్తకాల స్థానానికి ఎలాంటి భంగం కలుగలేదు.