విద్య, దాని స్వభావం (Nature of Education)
- భారతీయ, పాశ్చాత్య విద్యావేత్తల అభిప్రాయాలను గమనిస్తే విద్య స్వభావం అనేక అంశాలతో కూడిన విశిష్ట లక్షణాలను మేళవిస్తుంది.
- శరీరంలోను, మనస్సులోనూ, ఆత్మలోనూ నిక్షిప్తమైన అత్యున్నత శక్తులను బయటకు తీయుటయే విద్య అని ఒకరంటే "జీవితమే విద్య" అని మరొకరన్నారు.
- నాగరిక ప్రపంచంలో విద్య అందరికి అవసరమే. మానవ సామాజిక జీవితం మారుతోంది. దీని నేపథ్యంలో విద్య అర్ధం, స్వభావం కూడ మారుతూ ఉంటుంది.
- మానవ పరిణామక్రమంలో విద్య స్వభావం కూడ గతిశీలమైనది. విద్య భావం అపరిమితమైనది. ఇది మానవ చరిత్రలో అతి ప్రాచీనమైనది.
- 'విద్య గర్భస్థ శిశువు నుంచి మరణించే వరకు నిరంతరం కొనసాగే ప్రక్రియ. మనిషి వివిధ దశల్లో పొందిన విజ్ఞానం, అనుభవం విద్యగా గమనించాలి.
- విద్య అనేది ఒక క్రమమైన పద్ధతిలో కొనసాగే ప్రక్రియ. ఇందులో ఒకస్థాయి అనంతరం “మరోస్థాయిలో ప్రగతిని కొనసాగించేదేకాని ఖండికలుగా ఒక స్థాయిని వదలి మరొక స్థాయి నుంచి ఆరంభించడం సాధ్యంకాదు. విద్యాసంస్థల్లో ఒక పద్ధతి ప్రకారం నిర్వర్తించబడుతుంది.
- విద్య అనేది వ్యక్తి నుంచి ఆరంభమై వ్యక్తుల సమూహం (society), సమాజంలోని అందరికి ఆవశ్యకమైనదని చెప్పవచ్చు. అనగా వ్యక్తి ప్రగతియే సామాజిక ప్రగతి, కాబట్టి విద్య. అన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది.
- విద్య వ్యక్తిలో పరివర్తన, ప్రవర్తన మార్పులను ఆశిస్తూ మానవ ప్రగతికి దిశానిర్దేశాన్ని సూచిస్తుంది.
- విద్య ఒక సుశిక్షణ దానిద్వారా వ్యక్తిలో క్రియాశీలత, సృజనాత్మకత, ప్రయోజనాత్మకతను
- పెంపొందిస్తుంది. విద్యలేని వాడు వింత్రపశువు. విద్యలేని జీవితం పశుత్తుల్యం, సకల ప్రాణులకు విద్య సహజాతంగా వస్తుంది. కాని మానవుడు మాట్లాడే జంతువు, అతనికి వివేచన, విచక్షణ విద్య ద్వారా మాత్రమే లభిస్తుంది.
- విద్య అనేది మానవుల్ని - ఇతర ప్రాణులకంటే, అలాగే విద్యలేని మానవుని కంటే ఉన్నత భావాలు కలిగిన నిపుణత గల వ్యక్తిగా రూపొందిస్తుంది. విద్యయే బలం, విద్యయే ధనం, విద్యావంతుడు ఎక్కడైనా రాణించగలడు.
- సమాజ ప్రగతికి, ఆరోగ్యకరమైన సమాజానికి విద్య ఎంతగానో ఆవశ్యకతను కలిగియుంది. కాబట్టి విద్య స్వభావం - ఇదమిద్దంగా ఇంతే అని చెప్పలేం. చాలా విస్తృతమైన పరిధిని కలిగిఉంది.