భారతదేశంలో స్వదేశీ ఎలిమెంటరీ విద్యావిధానం చారిత్రాత్మక దృష్టి (Elementary Education in India - Historical perspective)
భారత ఉపఖండంలో విద్య ప్రాధాన్యత ఎంతగానో ఉంది. సనాతన కాలంనుంచి అంటే చారిత్రక యుగం ఆరంభం నుంచి అంతకుపూర్వం వేదాలు, ఉపనిషత్తులు, ''స్మృతులు. మొదలగువాటి ఆధారంగా విద్యావిధానం అమలులో ఉండేది
ప్రాచీన విద్యావిధానం, బోధనా విద్యా విధానాలు చాలావరకు సాంప్రదాయిక పద్ధతుల్లోనే కొనసాగాయి. ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చాతుర్వర్ణాలుగా విభజింప బడినారు. పురాణాలు, రామాయణ, భాగవత, భారత ఇతిహాసాల్లో గురుశుశ్రూషలుచేస్తూ ఆశ్రమ విధానంలో విద్యను అభ్యసించేవారని మనకు తెలుస్తుంది. విద్యాబోధనకు ఒక నియమిత కాలం, అలాగే నియమిత అంశాలు బోధించాలనే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవసరం, అవకాశం, సందర్భానుసారంగా బోధించబడేవి. వార్షిక పరీక్షలు అనే భావన కాకుండా ధర్మసూత్రాలు, సత్యం, న్యాయం, సామాజిక ప్రాతిపదికన వ్యక్తి అభిరుచిని బట్టి ఆయా రంగాలలో వారికి తర్ఫీదు ఇచ్చేవారని మనకు తెలుస్తుంది. అంతిమంగా పరీక్షలు నిర్వహణ-పోటీలు, ప్రతిభాపాటవముల ప్రదర్శన, యోధులకు సన్మానం మొదలైనవి జరుపబడినట్లు తెలుస్తుంది. అనంతరకాలంలో మతఛాందస భావాలతో కూడిన విద్యావిధానం కొనసాగినట్లుగా తెలుస్తుంది. మతబోధనలు, ధర్మ ప్రవచనాలు, గణితం, తర్కశాస్త్రం, న్యాయశాస్త్రంలో వృత్తివిద్యలు, శ్రమకు ప్రాధాన్యత ఇవ్వబడింది.
అనంతర కాలంలో హిందూమతంలో భేదభావాలు, శైవ, వైష్ణవ, చార్వాక, వీరవైష్ణవ, వీరశైవ ప్రాబల్యాలు, విద్యావిధానంలో కొంత సంస్కరణలు తెచ్చినప్పటికిని; సామాజిక కట్టుబాట్లు, నియమ నిబంధనలు, విలువల ఆచరణ తగ్గి మత బోధకులు, గురువుల ఆలోచనల్లో వికృత ఆలోచనలు చోటు చేసుకోవడం జరిగింది. జైన, జైన, బౌద్ధమతాల ఆవిర్భావం అనంతరం విద్యావిధానంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. బౌద్ధంలో మహాయాన, హీనయాన, జైనమతంలో శ్వేతాంబరులు, దిగంబరులు అనే వర్గ పోరాటాలు కొనసాగాయి. అయినప్పటికి ప్రజల్లో విద్యపట్ల మంచి శ్రద్ధ ఏర్పడింది. వాటికి అనుగుణంగా ఆనాటి ఆంగ్లేయులు, వారి ఆలోచనల వల్ల మన విద్యావ్యవస్థలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్యావర్తంలో నలంద, తక్షశిల, కాశీ, అయోధ్య వంటి ప్రదేశాల్లో విద్యాపీఠాలు, విశ్వవిద్యాలయాలు ప్రారంభించబడినాయి. బౌద్ధమత ప్రాబల్యం కలిగిన రాచరిక స్థానాల్లో విద్యాపరమైన మేధోమథనం, ధర్మసమ్మేళనాలు జరిగినాయి. సామాన్య మానవునికి చదువుకునే అవకాశం లేనప్పటికిని, కనీసం ప్రవచనాలు వినే అవకాశం, తద్వారా వివేచనా పరిధి పెరిగి తామెందుకు చదువుకోరాదూ! అనే భావనకు నాందీ పలికింది.
భారత భూభాగంపై అలెగ్జాండర్ దండయాత్ర మొదలు అనేక ప్రాచీన, పాశ్చాత్య 'దేశాలు, అధికార పీఠాన్ని ఏర్పరచాలనే దృక్పథం, అలాగే తురుష్కుల, అరబ్బుల ఆగమనం ఆరంభమైంది. వర్తక వ్యాపారం విదేశీయానం అనే నెపంతో వచ్చి ఇక్కడి హిందువుల అనైక్యతను, అవకాశంగా తీసుకొని సామ్రాజ్యవాదానికి తెరతీసారు. ఇస్లామిక్ విధానాలు, మతఛాందసభావనలు, అరబ్బీ, పారశీక భాషలను అభివృద్ధి పరచాలనుకొన్నారు. మతసంస్థలు, మక్తబ్లు ఏర్పాటుచేశారు. అయినప్పటికిని స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదు. స్త్రీకి కుటుంబపోషణ, గృహనిర్వహణ వరకే విద్యావకాశాలు కలిగించబడినాయి.
' ప్రాక్ పశ్చిమ దేశాలు, ఐరోపా వాసులు మనదేశంపై దృష్టిని సారించారు. నావికాయానం, విజ్ఞానవికాసం, నూతన అంశాల అన్వేషణల ఫలితంగా, యూరోపియన్ల రాక ఆరంభమైంది. అప్పటికీ హిందూమతం' వివిధ మతాల చీలికల రూపంలో ఉంది. ముస్లిం అనైక్యత వల్ల యూరోపియన్లకు మార్గం సుగమమైంది. ఇలా వారి కాలంలో పారిశ్రామిక విప్లవ ఫలితంగా కలోనియలిజం, సామ్రాజ్యవాదం పెల్లుబికింది. వర్తక వాణిజ్యాల్లో పోటీతత్వం మరింత పెంచ అయినప్పటికీ సనాతన విద్య వైదిక్షకాలంనాటి విద్యలో భాగంగా ప్రధానంగా సంస్కృతం బోధించబడినది. ఇది కేవలం ఉన్నత వర్గాల వారికి మాత్రమే అందుబాటులో ఉండేది.